ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం సోమవారం జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన ఐక్యుఎసి కో ఆర్డినేటర్ డాక్టర్ పి రాజగోపాల్ బాబు మహిళా దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు. సరోజినీ నాయుడు మంచి రచయిత అని, ఆమె సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలను దష్టిలో పెట్టుకొని రచనలు చేసిన సామాజిక విప్లవ కారిణి అని పేర్కొన్నారు అర్థశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సిహెచ్ శంకర్రావు మాట్లాడుతూ స్త్రీలు పురుషాధిక్య సమాజపు పోకడలకు గురికాకుండా తమకు తాముగా ఆలోచించాలని, రక్షణ కల్పించుకోవాలని సూచించారు. సరైన దిశలో ఆలోచిస్తే ప్రతి మహిళ సరోజినీ నాయుడులా అభివద్ధి చెంది గుర్తింపును తెచ్చుకుంటారని చెప్పారు. మహిళా సాధికారతా విభాగం కన్వీనర్ షేక్ షానాజ్ బేగం మాట్లాడుతూ సరోజినీ నాయుడు ఎదుగుదల గురించి వివరించారు. మహిళా సాధికారత విభాగం సభ్యులు మైత్రి, డాక్టర్ కే సుజాత, డాక్టర్ పద్మావతి, డాక్టర్ అనూష ,ఎం జ్యోతి, ,ఇంద్రజ మొదలైన అధ్యాపకులు తమ తమ సందేశాలను వినిపించారు.










