టెన్త్ టాలెంట్ టెస్ట్‌ని జయప్రదం చేయండి : ఎస్‌ఎఫ్‌ఐ
ప్రజాశక్తి - ఆత్మకూరు
ఈనెల 15వ తేదీన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక థెరిస్సా జూనియర్ కళాశాల సెంటర్ నందు మధ్యాహ్నం రెండు నుండి నాలుగు వరకు నిర్వహించే టెన్త్ టాలెంట్ టెస్ట్‌ని జయప్రదం చేయాలని ఆత్మకూర్ ప్రైవేట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వి చలపతి, ఆత్మకూరు ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి కే దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలపారు. పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు ఇప్పటి నుండే మార్కులు, ర్యాంకులు, గ్రేడులు సంపాదించి, తమ భవిష్యత్తుకు బాటలు వేసుకునే అన్వేషణలో నిమగమై పరీక్షలలో పేపర్ ఎలా వస్తుందో.. అనే ఆలోచనలో ఉన్నారు. విద్యార్థులలో ఈ భయాన్ని పోగొట్టి మనోధైర్యాన్ని నిలిపేందుకు ప్రముఖ విద్యావేత్త, కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి కే.ఎస్. లక్ష్మణరావు పర్యవేక్షణలో ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న పరీక్ష ''ప్రజ్ఞ వికాస'' పదవ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకో వాలని వారు అన్నారు. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ మీడియంల్లో ఉంటుందని, సబ్జెక్ట్స్ వారిగా తెలుగు - 10, ఇంగ్లీష్ - 20, హిందీ - 10, లెక్కలు - 20, ఎన్‌ఎస్ -10, పిఎస్ -10, సోషల్ -20, మార్కులకు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సమాచారం కొరకు 6303261839, 8790372547 ఈ నెంబర్‌ని సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఆత్మకూర్ ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










