Sep 14,2023 19:59

పాదయాత్ర చేస్తున్న తెలుగు మహిళలు

ప్రజాశక్తి-కందుకూరు : నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సూచనలతో తెలుగు మహిళలు గురువారం పాదయాత్ర నిర్వహించారు. కందుకూరులోని పార్టీ కార్యాలయము నుంచి మొదలైన పాదయాత్ర, కొండముడుసుపాలెం చేరుకోగానే, అక్కడ రామాలయంలో పూజలు నిర్వహించారు. కందుకూరు పట్టణంతో పాటు అన్ని మండలాల నుంచి 50 మందికి పైగా మహిళలు మోపాడు చేరుకున్నారు. తర్వాత మోపాడు వద్ద సత్య సాయి బాబా మందిరం వరకు పాదయాత్ర నిర్వహించి, చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు మహిళలు నెల్లూరు పార్లమెంట్‌ మహిళా కార్యదర్శి బత్తిన ఆదెమ్మ, దావులూరి శేషమ్మ, సింగమనేని పద్మ, బుజ్జమ్మ, రావి సరిత, ముప్పరాజు హారిక, అత్తంటి శ్రీలక్ష్మి, శ్రీలత, వెంకటరత్నం, ద్రాక్షాయని, పార్వతి, ఎస్తేరమ్మ, ఇంకా పలువురు పాల్గొన్నారు.