ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులకు ఒక్కపైసా ఇవ్వకున్నా.. హయ్యర్ పెన్షన్ స్కీమ్‌ను తమ ఘనతగా చెప్పుకోవడం ప్రభుత్వానికి తగదని ఎస్‌డబ్ల్యుఎఫ్ పేర్కొంది. ఉద్యోగి డబ్బు పెట్టి కొనుక్కున్న పెన్షన్‌ను తామే ఇస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి విశ్వరూప్ శాసనసభలో అబద్ధాలు చెప్పడం సరికాదని తెలిపింది. ఆర్‌టిసిలో 2014 నుండి ఇప్పటివరకు ప్రభుత్వం కానీ, ఆర్‌టిసి యజమాన్యం కానీ ఒక్క పైసా ఇపిఎఫ్‌కు చెల్లించలేదని తెలిపింది. హయ్యర్ పెన్షన్ విధానం ద్వారా ఉద్యోగులకు రూ.40 వేల పెన్షన్ ఏ విధంగా వస్తుందో చెప్పాలని డిమాండ్ చేసింది.










