Jun 20,2022 15:13

ప్రజాశక్తి-నందిగామ : జూలై 1 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నట్లు సిఐటియు నందిగామ వమండల కార్యదర్శి కటారపు గోపాల్ పేర్కొన్నారు. సోమవారం నందిగామ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నందిగామ శానిటరీ ఇన్స్పెక్టర్  శివ ప్రసాద్ రెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా నందిగామ మండలం సిఐటియు కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 6 నేలలు హెల్త్ అలవెన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మే నెల జీతాలు వెంటనే విడుదల చేయాలని, కార్మికులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు.ఈ సమస్యలు ఈ నెల లోపు పరిష్కరించకపోతే జూలై 1 తర్వాత సమ్మె చేస్తామని తెలియజేస్తూ సమ్మె నోటీసు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సైదా, కమిటీ సభ్యులు మాణిక్యం, పుల్లయ్య, నతానియేలు, బేబీ, దేవ సహాయం కార్మికులు పాల్గొన్నారు.