న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) భర్తీ చేయనుంది. సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఎస్‌ఎస్‌ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 24,205 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇవి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సహస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.
మొత్తం పోస్టులు: 24,205
ఇవి బీఎస్‌ఎఫ్ 10,497
సీఐఎస్‌ఎఫ్ 100
సీఆర్‌పీఎఫ్ 8911
ఎస్‌ఎస్‌బీ 1284
ఐటీబీపీ 1613
ఏఆర్ 1697
ఎస్‌ఎస్‌ఎఫ్ 103 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఇంటర్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోచ్చు.
వయోపరిమితి : అభ్యర్థులు 26 ఏళ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్ మెన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30
రాతపరీక్ష: 2023, జనవరిలో
వెబ్‌సైట్: https://www.ssc.nic.in లేదా http://www.crpf.gov.in










