ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం 45 నెలల పాలనలో అమలులోకి తెచ్చిన పలు పథకాల అమలు పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించాలని భావించింది. ఇందుకోసం ఒక్కో జిల్లాకు ఒక్కో ఐఎఎస్ ప్రాతిపదిక 26 మందిని స్పెషల్ ఆఫీసర్లు (ప్రత్యేకాధికారి)గా నియమించింది. ముఖ్యంగా నాడుానేడు (పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీలు) నవరత్నాలుాపేదలందరికీ ఇళ్లు, జగనన్న శాశ్వత భూ హక్కుాభూ రక్ష పథకం, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల పనితీరును మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకాధికారుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రజల సమస్యలను గుణాత్మకంగా సకాలంలో పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం 'జగనన్నకు చెబుదాం' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో అమలు పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
స్పెషల్ ఆఫీసరు హోదా కేటాయించిన జిల్లా
గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ సెక్రటరీ అల్లూరి సీతారామరాజు
వైద్య,ఆరోగ్యశాఖ కమిషనరు అనకాపల్లి
పౌర సరఫరాల సంస్థ కమిషనరు అనంతపురం
ఆప్కాబ్ ఎమ్‌డి అన్నమయ్య
సాంకేతిక విద్య, కమిషనరు బాపట్ల
పౌరసరఫరాల సంస్థ ఎమ్‌డి చిత్తూరు
సిఆర్‌డిఎ కమిషనరు తూర్పుగోదావరి
జలవనరులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏలూరు
సెర్ప్ సిఇఒ గుంటూరు
వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాకినాడ
బిసి, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ
ఎపిఎస్‌హెచ్‌సిఎల్ ఎమ్‌డి కృష్ణా
టిఆర్‌అండ్‌బి ప్రభుత్వ సెక్రటరీ కర్నూలు
ఐ.టి.ఇ అండ్‌సి డిపార్టుమెంట్ ప్రభుత్వ సెక్రటరీ నంద్యాల
వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనరు ఎపిఎస్ నెల్లూరు
కమర్షియల్ ట్యాక్స్ కమిషనరు ఎన్‌టిఆర్
పంచాయతీరాజ్ కమిషనరు పల్నాడు
స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్వతీపురం మన్యం
హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకాశం
ఎపి జెన్కో ఎమ్‌డి శ్రీసత్యసాయి
సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్సు కమిషనరు శ్రీకాకుళం
హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ తిరుపతి
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కమిషనరు అండ్ డైరెక్టర్ విశాఖపట్నం
పాఠశాల విద్య కమిషనరు విజయనగరం
ఫిషరీష్, కమిషనరు పశ్చిమ గోదావరి
ఎపిఎంఎస్‌ఐడిసి ఎమ్‌డి వైఎస్‌ఆర్










