Oct 15,2023 16:30

హైదరాబాద్‌ : నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటికే వేల ఇండ్లను కట్టించి ఇచ్చారు కేసీఆర్‌. ఇక మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మరో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాం అని కేసీఆర్‌ గుర్తు చేశారు. 11 లక్షల మంది నిరాశ్రయులుగా ఉన్నారని తేలింది. ప్రతి సంవత్సరం కొంత మేజర్‌ అయినవారు విడిపోతారు కాబట్టి ఇండ్లు కట్టివ్వాలని చెప్పారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు తీసుకున్నాం. గఅహలక్ష్మి కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున తీసుకుని ముందుకు పోతున్నాం. డబుల్‌ బెడ్రూం ఇండ్లకే ప్రభుత్వమే జాగాలు సమకూర్చి కట్టించి ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఇల్లు లేదని బాధపోవాలి. ప్రతి ఒక్కరికి గూడు కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి హైదరాబాద్‌లో ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి. హైదరాబాద్‌ సిటీలో మరో లక్ష డుబల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్‌ఎస్‌ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇస్తున్నాం అని కేసీఆర్‌ ప్రకటించారు.