Jun 09,2023 11:33

ప్రజాశక్తి-కాకినాడ కార్పొరేషన్‌ : కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చొల్లంగి గ్రామ పరిధిలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. చివర రోజున ఈ కార్యక్రమానికి కమిషనర్‌ రమేష్‌ అధ్యక్షత వహించగా, ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, మాజీ మేయర్‌ సుంకర శివప్రసాన్న, కూడా చైర్పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి ముఖ్య అతిథులుగా పాల్గని మిగిలిన లబ్ధిదారులకు పట్టాలని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ... నవరత్నాలలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా సుమారు 5000 మందికి పైగా లబ్ధిదారులకు చల్లంగి గ్రామ పరిధిలో ఇళ్ల నిర్మాణం చేపట్టుకునేలా వారికి స్థలాలు కేటాయించి అప్పగించడం జరిగిందన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు హరిదాసు, డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ పఅథ్వి చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.