Jul 01,2023 11:38

ప్రజాశక్తి-కర్నూలు స్పోర్ట్స్ : ప్రపంచ సేపక్ తక్ర కింగ్స్ కప్ పోటీలకు మన జిల్లాకు చెందిన సి.శివకుమార్ భారత జట్టుకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో భారత జట్టుకు ఎంపికైన సి.శివ కుమార్ ను జిల్లా కలెక్టర్ సృజన షాలువ కప్పి బొకే అందజేసి అభినందించి సత్కరించారు. జులై ఎనిమిదవ తేదీ నుండి 16వ తేదీ వరకు థాయిలాండ్ దేశంలోని నా కోన్ రచ్చ సిమ నగరంలో జరిగే 36వ ప్రపంచ సేపక్ తక్రా కింగ్స్ కప్ పోటీలకు మన రాష్ట్ర తరఫున పాల్గొనడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ పోటీల్లో మన రాష్ట్ర ఖ్యాతిని నిలిపాలని కోరారు. రాష్ట్ర సెపక్ తక్రా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ వరల్డ్ కప్ అనంతరం 45 రోజులపాటు బ్యాంకాక్ లో జరిగే శిక్షణా శిబిరానికి శివకుమార్ ఎంపికయ్యారు. ఈ శిక్షణా శిబిరం అనంతరం శివకుమార్ ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనడం జరుగుతోంది తెలియజేశారు శివకుమార్ సుమారు నాలుగు జాతీయ శిక్షణ శిబిరానికి హాజరు కావడం కారణంగా తన నైపుణ్యాన్ని గుర్తించిన సెలెక్టర్స్ భారత జట్టులో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశాన్ని కల్పించారు. గతంలో అనేక జాతీయ స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కారణంగా భారత జట్టులో స్థానాన్ని దక్కించుకోవడం రాష్ట్రంతో పాటు జిల్లాకే గర్వకారణం భవిష్యత్తులో మరిన్ని పోటీలకు మన జిల్లా క్రీడాకారుడు ఎంపిక కావాలని ఆశిద్దాం. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సీఈఓ రమణ, జాతీయ క్రీడాకారుడు మధు తదితరులు పాల్గొన్నారు.