- ఆస్ట్రేలియా పర్యటనకు మహిళల హాకీ జట్టు ఇదే!
భువనేశ్వర్: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత హాకీ మహిళల బృందానికి గోల్‌కీపర్ సవిత సారథ్యం వహించనుంది. ఆసీస్ పర్యటనకు వెళ్లే భారత హాకీ జట్టును హాకీ ఇండియా(హెచ్‌ఐ) సోమవారం ప్రకటించింది. 20మంది ఆటగాళ్ల బృందానికి సవిత కెప్టెన్‌గా, దీపక్ గ్రేస్ ఎక్కా వైస్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు.
మే 18నుంచి ఆడిలైడ్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. 2022 ఏడాది బల్బీర్ సింగ్ సీనియర్ హాకీ 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్(2022)అవార్డు'ను సవిత అందుకున్నారు. ఇక బిఛ్ఛూ దేవి ఖరిబమ్ రెండో గోల్‌కీపర్‌గా ఎంపికైంది. మహిళల హాకీజట్టు మే 18, 20, 21న ఆస్ట్రేలియాతో, అలాగే ఆస్ట్రేలియాాఏతో 25, 27న ఆడిలైడ్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనుంది.
జట్టు..
గోల్‌కీపర్లు: సవిత దేవి, బిచ్ఛూదేవి ఖరిబమ్
డిఫెండర్లు: దీప్ గ్రేస్ ఎక్కా, నిక్కి ప్రధాన్, ఇషికా చౌదరీ, ఉదిత, గుర్జీత్ కౌర్
మిడ్‌ఫీల్డర్లు: నిషా, నవ్‌జ్యోత్ కౌర్, మోనిక, సలీమా, నేహా, నవ్‌నీత్ కౌర్, సోనికా, జ్యోతి, బల్జీత్ కౌర్.
ఫార్వర్డ్స్: వందన కటారియా, లాల్‌రెమిసిమి, సంగీత, షర్మిలా.










