స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
ప్రజాశక్తి కదిరి టౌన్ : మున్సిపల్ ఉర్దూ స్కూల్‌లో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సిద్దారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో జమాతే ఇస్లామీ హింద్ ఇటికల ఇలియాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రదర్శనను అందరూ సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు.










