Feb 13,2023 19:58

మాట్లాడుతున్న లోగోను ఆవిష్కరిస్తున్న డాక్టర్లు

మాట్లాడుతున్న లోగోను ఆవిష్కరిస్తున్న డాక్టర్లు
శస్త్రచికిత్సతో 'మూర్ఛ' నుంచి విముక్తి
- డాక్టర్‌ ఎన్‌ఎస్‌.సంపత్‌కుమార్‌
నెల్లూరు:ఆధునిక, సాంకేతిక పరిజ్ఞాన్ని వైద్య శాస్త్రంలో అందుబాటులో రావడంతో వైద్యనిపుణులు శస్త్రచికిత్సలు నిర్వహించడం ద్వారా మూర్ఛవ్యాధిని పూర్తిగా నయం చేయగలుగుతున్నామని నారాయణ హాస్పిటల్‌ న్యూరాలజి విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌.ఎస్‌ సంపత్‌ కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ మూర్ఛవ్యాధి అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణ హాస్పిటల్లోని డావ బి.సి రారు లెక్చర్‌ గ్యాలరీలో పి.ఎం.పి అసోసియేషన్‌ సభ్యులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నారాయణ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. హరిప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో డాక్టర్‌ ఎన్‌.ఎస్‌. సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ గతంలో మూర్ఛ వ్యాధిగ్రస్తులు స్వేచ్ఛాయుత జీవితాన్ని గడపలేక, మానసికంగా కంగిపోతుండేవారన్నారు
. ఈ అనారోగ్య సమస్యతో బాధపడే వారు ఉన్నత చదువులు చదువుకోవాలన్నా, వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలన్నా, ఒంటరిగా ప్రయాణంచాలన్నా వీలుకాక మానసిక వికలాంగులుగా మిగిలిపోతుండేవారన్నారు. అటువంటి మూర్ఛ వ్యాధికి సరైన అవగాహన, ఆర్ధిక స్థోమతతో సంబంధిత చికిత్సలు చేయించుకోవడంలో వీలుకాక అనేక మరణాలు సంభవించిన సంఘటనలున్నాయన్నారు. ఇప్పుడు ఈ సమస్యను సమూలంగా రూపుమాపే సరికొత్త వైద్య విధానాన్ని నారాయణ హాస్పిటల్‌ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. సుమారు 50 మంది వరకు ఈ శస్త్రచికిత్సలు చేయించుకుని సాధారణ జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ఈ సదస్సులో మూర్ఛవ్యాధి ఎలా వస్తుంది, మూర్ఛ వ్యాధి లక్షణాలు తదితర అంశాలను డాక్టర్‌ ఎన్‌.ఎస్‌ సంపత్‌ కుమార్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా తెలిపారు.నారాయణ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. హరిప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలో ఒక సరికొత్త ప్యాకేజీని మూర్ఛ వ్యాధిస్తుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ ప్యాకిజీ ద్వారా వైద్యపరీక్షలు పొంది శస్త్రచికిత్సలు అవసరమైన వారికి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా చేసేందుకు నారాయణ హాస్పిటల్లో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సదస్సులో చివరగా మూర్చవ్యాధిపై అవగాహన అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం న్యూరాలజి విభాగాధిపతి డాక్టరÊ ఎన్‌ఎస్‌ సంపత్‌కుమార్‌ను పిఎంపి అసోసియేషన్‌ ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమంలో పి.ఎం.పి అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు అనుమల జయప్రకాష్‌, పి.ఎం.పి జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్‌ , నారాయణ హాస్పిటల్‌ ఏజీఎం, భాస్కర్‌ రెడ్డి , పి.ఎం.పి నాయకులు గోరంట్ల శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు, పొదిలి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.