ప్రజాశక్తి - తిరువూరు : అభ్యుదయ సాహిత్య రంగంలో శ్రీశ్రీ ఒక ధృవతారని అభ్యుదయ రచయితల సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రేపాక రఘునందన్ అన్నారు. శ్రీశ్రీ 113వ జయంతిని స్థానిక గ్రంథాలయంలో ఆదివారం రచయితలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రేపాక శ్రీశ్రీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అయ న మాట్లాడుతూ ఇతర కవుల ప్రభావా నికి లోనయ్యే దశనుండి ఇతర కవుల ను ప్రభావితం చేసే దశ ఏర్పరచిన కవి శ్రీశ్రీ అన్నారు. పద్యం, గేయం, పాట, వచనం ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహాకవి శ్రీశ్రీ అని అన్నారు. మే డే సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో శ్రామికుల, కర్షకుల స్థితిగతుల గురించి కవులు తమ కవితల ద్వారా వ్యక్తం చేశారు. ఈకా ర్యక్రమంలో రచయితలు భరతకు మారి, జానీ బాష, వజ్రాల ఇందిర, ఉయ్యూరు అనసూయ, మందడపు రాం ప్రదీప్, వేల్పుల భాస్కర్ పాల్గొన్నారు.










