బిఎస్‌ఎన్‌ఎల్ సబ్ డివిజనల్ ఇంజినీర్ రాజు
ప్రజాశక్తి - విజయవాడ : స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకుంటు న్నామంటే సరదాకుకాదని, అది మన జీవితంలో ఉపయోగపడేలా మార్చుకోవాలని బిఎస్‌ఎన్‌ఎల్ సబ్ డివిజనల్ ఇంజినీర్ రాజు అన్నారు. శనివారం బాలోత్సవ భవన్లో ప్రారంభమైన ఉచిత స్పోకెన్ ఇంగ్లీషు శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మనం పనిచేస్తున్న రంగంలో రాణించాలన్నా, అభివద్ధి కావాలన్నా, ఉన్నత స్థానానికి చేరాలన్నా ఇంగ్లీషుపై పట్టుసాధించాల్సిన అవసరం పెరిగిందన్నారు. ఇంగ్లీషు నేర్చుకోవాలంటే ఆసక్తితోపాటు పట్టుదల కూడా ఉండాలన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా ఇంగ్లీషు వినాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన బాలోత్సవం బాధ్యులు ఎస్‌పి రామరాజు మాట్లాడుతూ స్పోకెన్ ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పరిజ్ఞానం అవసరమన్నారు. ఎంబి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకష్ణ మాట్లాడుతూ ఆయా ప్రాంతాలలో మనం రాణించాలంటే అనుసంధాన భాషగా ఇంగ్లీషును నేర్చుకోవాలన్నారు. అదే సమ యంలో మాతభాషనూ విస్మరించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబివికె బాధ్యులు యు.వి. రామరాజు పాల్గొన్నారు.










