Feb 13,2023 19:55

డిఇఒకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

డిఇఒకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
సోషల్‌ టీచర్‌ ను వెంటనే నియమించాలి
- సిపిఎం రూరల్‌ మండల కమిటి
నెల్లూరు :రూరల్‌ మండల పరిధిలోని వెల్లంటి గ్రామం పాఠశాలలో సోషల్‌ టీచర్‌ ను వెంటనే నియమించాలంటూ సిపిఎం రూరల్‌ కమిటీ జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్‌ఎస్‌ గంగాభవానికి వినతిపత్రం అందజేసింది.ఈ సందర్భంగా రూరల్‌ మండల కార్యదర్శి ఆలూరి తిరుపాలు మాట్లాడుతూ గతంలో సోషల్‌ సబ్జెక్టుకు ఇద్దరు టీచర్లు ఉండే వారని ఒక ఉపాధ్యాయుడు ఏడాదిగా సెలవు పెట్టిగా రెండవ ఉపాధ్యాయుడు డిప్యూటేషన్‌ పై మరో చోట విధులు నిర్వహిస్తున్నారన్నారు.
సోషల్‌ సబ్జెట్‌ బోధన చేసేందుకు ఉపాధ్యాయుడు లేకపోవడం కారణంగా గత ఏడాది ఈ పాఠశాల నుంచి పదవ తరగతి పరీక్షలకు 46 మంది విద్యార్ధులు హాజరు కాగా 22 మంది ఈ సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యారన్నారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం దాదాపుగా పూర్తియిందని, పరీక్షలు దగ్గర పడుతున్నాయని సోషల్‌ సబ్జెక్టుకు టీచర్‌ లేకపోతే స్టూడెం ట్స్‌ ఏడాది కాలాన్ని నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్‌ గంగాల వెంకటరమణయ్య, సిపిఎం నాయకులు పూడిపర్తి జనార్దన్‌, పాదర్తి మస్తాన్‌, పాదర్తి నారాయణ, ఎం వెంకటసుబ్బయ్యలు పాల్గొన్నారు.