Jul 18,2021 15:18

అమరావతి : సంక్షేమ పథకాలను కొనసాగించడానికి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడుతోందని టిడిపి సీనియర్‌ నాయకులు యనమల రామకృష్ణుడు ఆగ్రమం వ్యక్తం చేశారు. వైసిపి దళిత వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పరిపాలించే ప్రధాన పదవుల్లో సిఎం జగన్‌ సొంతవారిని పెట్టుకున్నారని అన్నారు. నిధులు లేని, అప్రధాన పదవులు బడుగు వర్గాలకు కేటాయించారని మండిపడ్డారు. సలహాదారుల పేరుతో ఎపి ప్రభుత్వం వందల కోట్లు దుబారా చేస్తోందని విమర్శించారు. ఇప్పుడు నామినేటెడ్‌ పదవుల పేరుతో దోపిడీకి సిద్ధమయ్యారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, రాచరిక వ్యవస్థను విస్తరిస్తున్నారని విమర్శించారు.