Sep 17,2023 17:41

కోడూరు తీరాన్ని శుభ్రం చేస్తున్న దశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :సముద్రతీరం పరిశుభ్రత అందరి బాధ్యత అని మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ యు. వి రంగనాధ బాబు పేర్కొన్నారు. ఆదివారం తోటపల్లి గూడూరు మండలం కోడూరు బీచ్‌ వద్ద మత్స్యకార సంక్షేమ సమితి (ఎంఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్‌-సురక్షిత సాగర్‌ నినాదంతో తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించారు. రంగనాధ బాబు మాట్లాడుతూ 1950లో ప్లాస్టిక్‌ ప్రవేశించిందన్నారు. అది విజంభించి తీరప్రాంత పరిరక్షణకు విఘాతం కలిగిస్తోందని రంగన్నాధబాబు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి కాలుష్యం ఎవరెస్ట్‌ శిఖరాన్ని మించి పోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారని అయన చెప్పారు. కష్ణపట్నం మెరైన్‌ పోర్ట్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛందంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్యకార సంక్షేమ అధికారి (ఎఫ్డిఓ) సంజరు, స్టీఫెన్‌, మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ రమేష్‌, మండల అధ్యక్షులు కంజి సుధాకర్‌, మురళి సాగర మిత్ర ప్రతినిధులు పి. విజయలక్ష్మి, జయ శ్రీ, మత్స్యకార సంక్షేమ సమితి ప్రతినిధులు ఉన్నారు.