Nov 05,2020 23:56

నిరాహార దీక్షలో కూర్చున్న జివిఎంసి మలేరియా విభాగం కార్మికులు

కలెక్టరేట్‌ : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జివిఎంసి మలేరియా విభాగంలో పనిచేస్తున్న కార్మికులు గురువారం నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జివిఎంసి మలేరియా విభాగం సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ, 2019లో కార్మికులకు బకాయిపడ్డ నాలుగు నెలల 14 రోజుల జీతం వెంటనే చెల్లించాలని, ఆకస్మికంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జి.నరేష్‌, ఎం.రాంజీ, వై.అప్పారావు, అప్పలనరసమ్మ, సూర్యకుమారి పాల్గొన్నారు.