సమస్యల వలయంలో సాంబశివపురం
ప్రజాశక్తి-బిట్రగుంట : మంగమూరు పంచాయతీ సాంబశివపురం గ్రామంలో టిడిపి కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని 25వ రోజు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఇదేం కర్మ రాష్ట్రానికి కరపత్రాలు, క్యాలెండర్లు పంచిపెట్టారు. గ్రామంలో రోడ్లు, సైడు కాలవలు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని, వైసిపి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, స్థానికులు వాపోయారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లేల్లపల్లి సుధీర్ బాబు, పార్టీ ముఖ్య నాయకులు యన్నాబత్తిన వెంకటేశ్వర్లు, వై శ్రీహరి, బ్రహ్మయ్య, సోమయ్య, పుట్ట సుబ్బారావు, గద్దె కొండయ్య, శేఖరు, శ్రీనివాసుల రెడ్డి, వంటేరు మాల్యాద్రి, బ్రహ్మయ్య, హరి, శ్రీనాథ్, పంది శీను, నిమ్మల యానాది, గుడిపల్లి రాధాకృష్ణయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.










