సిఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
ప్రజాశక్తి-మర్రిపాడు : ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బాధితునికి మంజూరైన రూ.6లక్షల సిఎం సహాయనిధి చెక్కును ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి శనివారం మండలంలోని బ్రాహ్మణపల్లిలోని ఆయన నివాసంలో అందచేశారు. ఆత్మకూరు మండలం బోయలచిరువెళ్ల గ్రామానికి చెందిన రావూరు ఆదిరెడ్డి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తనకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందించాలని ఎంఎల్‌ఎ దృష్టికి మండల నాయకులతో కలసి విన్నవించారు. వెంటనే స్పందించిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి బాధితుడు రావూరు ఆదిరెడ్డి పరిస్థితిని వివరించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.6లక్షలు మంజూరు చేయించారు. ఆ నిధుల చెక్కును బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందరికీ వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకున్నారన్నారు. అంతేకాక ఆరోగ్యశ్రీ పథకం వర్తంచని ఇలాంటి బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి అందచేస్తూ వారిని ఆదుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు చేసిన సిఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి, మంజూరుకు కృషి చేసిన ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డికి బాధితుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.










