ప్రజాశక్తి-నెల్లూరు :ఎస్‌ఎస్‌ఎ కార్యాలయం పరిధిలో మండలాల్లో పనిచేసే సిఆర్‌పి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్, ఎం ఐ ఎస్‌లు ,మెసెంజర్లు, ,ఆర్ట్, క్రాఫ్ట్, పిఇటిలకు ప్రభుత్వం వెంటనే వేతనాలను పెంచాలని పిడిఎఫ్ పట్టభద్రులు ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లురెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం అనంతసాగరం మండలంలో పిడిఎఫ్ తరుపున పోటీ చేస్తున్న పట్టభద్రుల అభ్యర్థి మీగడ వేంకటేశ్వర్లు రెడ్డి అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో, పట్టభద్రుల కలిసి జరగబోయే ఎంఎల్‌సి ఎన్నికల లో పట్టభద్రుల అభ్యర్థిగా తనకు,ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి గా పొక్కిరెడ్డి బాబు రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కె జి బివి ఉపాధాయులు, సిఆర్‌పిలు అందరూ ఎస్‌ఎస్‌ఎ పరిధిలోనే పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులని పేర్కొన్నారు. కానీ కొందరికి జీతాలు పెంచి మండల పరిధిలో పనిచేసే ఈ వర్గం ఉద్యోగులకు జీతాలు పెంచక పోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం 23శాతం జీతాలు వీరికి పెంచాలన్నారు. మెసెంజర్లు అతితక్కువ వేతనాలు తీసుకుంటున్నారన్నారు. వారికి కనీస వేతనం చెల్లించాలన్నారు. స్పెషల్ బి ఈ డి అర్హతతో ఉద్యోగాలు పొందిన ఐఇ ఆర్ పి లకు జీతాలు పెంచాలన్నారు. రాష్ట్రంలో భారీగా ఖాళీ పోస్టులున్నాయని, వాటిని భర్తీ చేసేందుకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులను ఆదరించాలని సూచించాచరు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి వి.వి. శేషులు, యుటిఎఫ్ అనంతసాగరం మండల ప్రెసిడెంట్ వద్దిబోయిన వేంకటేశ్వర్లు రెడ్డి, యుటిఎఫ్ మండల కార్యదర్శి ఎస్‌కె సాదిక్, యుటిఎఫ్ సీనియర్ నాయకులు ఎస్‌కె . ఖాజా మొహిద్దిన్, పాపిశేట్టి నరసింహులు యుటిఎఫ్ నాయకులు,కార్యకర్తలు,సిఐటియు అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా,రైతు సంఘం నాయకులు ఉప్పలపాడు మస్తాన్, పెంచల నాయుడు పాల్గొన్నారు.










