Feb 14,2023 18:40

ర్యాలీ నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది

ప్రజాశక్తి -కందుకూరు :ప్రతిరోజు సైకిల్‌ తొక్కడం వల్ల శారీరక బరువు తగ్గటమే కాక క్యాన్సర్‌ వ్యాధిని, గుండే జబ్బులను నివారించవచ్చని జిల్లా ఉపవైద్యా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ప్రియంవద పేర్కొన్నారు. మంగళవారం మాచవరంలో ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ వెల్‌నెసే సెంటర్‌ మేరా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతిరోజు సైకిలింగ్‌ చేయడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులను నివారించవ్చన్నారు. మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్‌ జివేదియా భాను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్‌ ర్యాలీలో హెచ్‌ఈవో ప్రసాద్‌ రావు, సూపర్‌వైజర్‌ బాషా, హెల్త్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌, ఎఎన్‌యంలు పాల్గొన్నారు.