జెండా ఆవిష్కరణలో పాల్గొన్న నాయకులు, సాగురైతులు
ప్రజాశక్తి - చిలమత్తూరు: సాగులో ఉన్న రైతులకు పట్టాలివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని దేమకేతేపల్లి పంచాయతీ ఓబులాపురం గ్రామం లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేమకేతేపల్లి పొలం సర్వేనెంబర్ 377,67 లలో జెండా ఆవిష్కరణను శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ దశాబ్ధాలుగా సాగులో ఉన్న రైతులకు హక్కు కలిస్తూ పట్టాలని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ కుమార్, లక్ష్మి నారాయణ, మాబు, నంజుండ, శ్రీనివాసులు, నిడిమామిడప్ప తదితరులు పాల్గొన్నారు.










