May 14,2023 22:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలవరం ప్రాజెక్టుకు నిధులను కేటాయించకుండా కేంద్రంలోని మోడి ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని అఖిలపక్షపార్టీలు, ప్రజా సంఘాలు ద్వజమెత్తాయి. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రాన్ని నిలదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అఖిలపక్షాలను డిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశాయి. ఆదివారం విజయవాడలోని దాసరి భవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణఅధ్యక్షతన పోలవరంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు హాజరై పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాయి. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు నరహరశెట్టి నరసింహారావు, సామాజిక విశ్లేషకులు టి లక్ష్మినారాయణ తదితరులు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేసేందుకు రూ 29,374కోట్లను విడుదల చేయాలనిరాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్‌ లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం రూ 1,429కోట్లు మాత్రమే ఇవ్వాల్సి వుందని బాద్యతారాహిత్యంగా ప్రకటన చేయడం తగదని విమర్శించారు. కేంద్రం ప్రకటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నోరుమెదపకపోవడం సరైంది కాదనాురు. ఈ అంశంపై సిఎం తక్షణం అఖిలపక్ష సమావేశానిు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉపక్రమించాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల ఎత్తును మొదటి దశ పేరుతో 41.15 మీటర్లకుతగ్గించి నిర్మాణాలను చేపట్టడం సరైంది కాదనాురు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులకునష్టపరిహారం తమకు సంబందంలేదని కేవలం ప్రాజెక్టు స్ట్రక్షర్‌ నిర్మాణానికి మాత్రమే నిధులను ఇస్తామని కేంద్రం అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపకపోవడం తగదనిఅనాురు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం నిధులను కేంద్రం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచేలా తక్షణం ఢిల్లీకి అఖిల పక్ష ప్రతినిధులను తీసుకెళ్లాలనిఅనాురు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, ప్రసాద్‌, పోతుల బాలకోటయ్య తదితరులు మాట్లాడారు.