ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బుధవారం బైపాస్ రోడ్డులో గల పద్మప్రియ కల్యాణ మంటపం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. శరీరం ఛిద్రమవడంతో మృతుడెవరో గుర్తు పట్టలేని విధంగా ఉంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పట్ల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.










