రూ.20వేలు అందజేత
ప్రజాశక్తి-ఉదయగిరి : 10వ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌లో అల్పాహారం అందజేయడానికి మద్దినేని చారిటబుల్ ట్రస్ట్ అడవి పేరంటాలమ్మ దేవస్థాన కమిటీ రూ.20 వేల నగదు అందజేశారు. ఆదివారం మండల పరిధిలోని గడ్డంవారిపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో మనబడి నాడు-నేడు రెండోదశలో జరుగుతున్న అదనపు తరగతుల నిర్మాణాన్ని మండల విద్యాశాఖ అధికారి షేక్ మస్తాన్ వలీ పరిశీలించారు. ఈ సందర్భంలో భాగంగా సర్పంచ్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల కోరిక మేరకు 10వ తరగతి విద్యార్థులు పురోగమి కాల నిర్ణయ పట్టిక ప్రకారం సాయంత్రం స్టడీలో అల్పాహారం అందించడానికి మద్దినేని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మద్దినేని అశోక్‌బాబు ట్రస్ట్ డైరెక్టర్ మద్దినేని అరవింద్ బాబు రూ.15వేలు, అడవి పేరంటాల అమ్మ సేవా ట్రస్ట్ చైర్మన్ కల్లూరి తిరుపతయ్య రూ.5వేలను అందజేస్తున్న నగదును ఎంఇఒ షేక్ మస్తాన్‌వలీ చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ నెల్లూరి వెంకటస్వామి నాయుడు, మద్దినేని చారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వాహకులు దారపునేని నాగేశ్వరరావు, సభ్యులు కె.రవికుమార్, ప్రధానోపాధ్యాయులు ఎన్.శీనయ్య ఉపాధ్యాయులు సర్దార్ పాల్గొన్నారు.










