Feb 13,2023 19:48

దుర్మరణం చెందిన బేల్దారి రమణయ్య

దుర్మరణం చెందిన బేల్దారి రమణయ్య
రోడ్డు ప్రమాదంలో బేల్దారి దుర్మరణం
కొడవలూరు:ముందు వెళుతున్న మినీ కంటైనర్‌ను బైక్‌ ఢకొీనడంతో బేల్దారి దుర్మరణం చెందారు. ఈసంఘటన మండలంలోని ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జలదంకి మండలం, చామదల గ్రామానికి చెందిన వల్లెపు రమణయ్య(51) బేల్దారి పనులు చేస్తుంటారు. రోజూ లాగే సోమవారం నెల్లూరులో బేల్దారి పనికి వెళ్లిన రమణయ్య పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి బైక్‌ పై బయల్దేరారు
. ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ వద్ద వెళుతుండగా ముందు పోతున్న మినీ కంటైనర్‌ ఒక్కసారిగా స్లో చేయడంతో బైక్‌ అదుపు కాక కంటైనర్ను ఢకొీన్నారు. దీంతో మోటార్‌ సైక్లిస్ట్‌ రమణయ్య రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై అక్కడకక్కడే మతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ జి. సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.