Aug 27,2022 22:56

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌
విజయవాడలో 'రంగ రంగ వైభవంగా' మూవీ టీమ్‌ సందడి చేసింది. మూవీ ప్రమోషన్‌ లో భాగంగా విజయవాడలోని ఓ హౌటల్‌ లో చిత్ర బందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. హీరో వైష్ణవ్‌ తేజ్‌ , హీరోయిన్‌ కేతికా శర్మ, దర్శకుడు గిరిషాయా,నిర్మాత ప్రసాద్‌ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత హీరో వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ మూవీ టైటిల్‌ ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుందని అన్నారు. కుటుంబ సమేతంగా కలసి చూడదగ్గ సినిమా అని అందరికీ తప్ప కుండా నచ్చుతుందని అన్నారు. సెప్టెంబర్‌ 2 న పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్లు వైష్ణవ్‌ తేజ్‌ వెల్లడించారు. హీరోయిన్‌ కేతిక శర్మ, నిర్మాత బి వి ఎన్‌ ఎస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.