ప్రజాశక్తి -ఏ.కొండూరు : ఎ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి సమస్యలపై వివిధ గ్రామాలలో ఆదివారం ప్రజా ఆరోగ్యవేదిక పర్యటించింది. ప్రజల నుండి వివరాలు సేకరిం చారు. మండలంలో కిడ్నీ జబ్బుల నేపథ్యం, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను, కిడ్నీ వ్యాధి నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజా ఆరోగ్య వేదిక కార్యకర్తలు అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జి. విజరుప్రకాష్ మాట్లాడుతూ రోజు రోజుకూ పెరిగి పోతున్న కిడ్నీ జబ్బులను నివారించేందుకు ఎ.కొండూరు మండలంలో రక్షిత కష్ణా నీటిని అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. నొప్పి నివారణా మందుల అమ్మకాలను, వాడకను నిషేధించాలని కోరారు.ఎ.కొండూరులో వెంటనే డయాలిసిస్ సెంటర్ ప్రారం భించాలని, వారానికి ఒక రోజు ఎ. కొండూరులో రోగులను పరీక్షించేలా నెఫ్రాలజిస్ట్ ను నియమిం చాల న్నారు. మండలంలో చీమలపాడు పెద్ద తండా, దళిత పేట, కృష్ణారావుపాలెం, దీప్లానగర్ తండా, మాన్ సింగ్ తండా, ఎ. కొండూరు, చైతన్య నగర్ తండా తదితర గ్రామాలలో ప్రజావేదిక సభ్యు లు పర్యటించారు. ఈకార్యక్ర మంలో ప్రజా ఆరోగ్య వేదిక నాయకులు లీలా, భార్గవ్, రాము, శ్రీధర్, శివశర్మ, దుర్గా భవాని, సమీర, సతీష్, రవితో పాటు స్థానిక ప్రజా సంఘాల నేతలు జెట్టి వెంకటేశ్వరరావు, ఆనందరావు, కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.










