న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దేశ రైతాంగానికి దళిత ఆదివాసీ శక్తి అధికార్ మంచ్(డిఎఎస్‌ఎఎం) సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు డిఎఎస్‌ఎఎం కార్యదర్శి సంజీవ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా కొనసాగుతున్న శాంతియుత నిరసనలను విచ్ఛిన్నం చేయడంతో పాటు నేరపూరితంగా చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఖండించింది. రైతులకు క్రిమినల్ చట్టాల కింద కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా నిరసించింది. ఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో పలువురు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలిచినట్లు డిఎఎస్‌ఎఎం తెలిపింది.










