Feb 13,2023 19:52

విజేతలుగా నిలిచిన ప్రకాశం జట్టు


విజేతలుగా నిలిచిన ప్రకాశం జట్టు
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేత ప్రకాశం
కోవూరు:జిల్లాలోని కోవూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి ప్రకాశం జిల్లా కప్పు కైవసం చేసుకుంది హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో నెల్లూరు జట్టు 28 పాయింట్లు దక్కించుకోగా ప్రకాశం జిల్లాకి 33 పాయింట్లు రావడంతో ఐదు పాయింట్ల ఆధిక్యంతో ప్రకాశం జిల్లా నిలిచి 50 వేల రూపాయల నగదు బహుమతిగా గెలుచుకుంది. ఈ కబడ్డీ పోటీల్లో మొత్తం 8 జిల్లాలకు పాల్గొనగా తొలుత నెల్లూరు, కష్ణా జిల్లాకు పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో నెల్లూరు జిల్లా గెలుపొంది ఫైనల్‌కి చేరుకుంది. మరో మ్యాచ్‌లో ప్రకాశం జిల్లా, తూర్పుగోదావరి జట్లకు హోరాహోరీగా పోటీలు జరిగాయి. ఈ పోటీలో తూర్పుగోదావరి జిల్లా పై ప్రకాశం జిల్లా గెలుపొందింది. దీంతో ఆదివారం కష్ణా జిల్లాలకు తూర్పుగోదావరి జిల్లాలకు పోటీలు నిర్వహించారు. కష్ణా జిల్లా పై తూర్పుగోదావరి జిల్లా గెలుపొంది మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో కష్ణాజిల్లా నిలిచింది
. ఫైనల్‌ గా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు జరిగిన ఈ చూపరులులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఈ పోటీలను తిలకించేందుకు కోవూరు, నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కబడ్డీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు ఈ క్రీడలను చూసేందుకు కావలి డి.ఎస్‌.పి వెంకటరమణ అత్యధి గా విచ్చేశారు. గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తతీయ నాల్గవ స్థానంలో నిలిచిన జట్లకు మెమెంటో కప్పులను రాష్ట్ర వ్యవసాయ సహాయక మండలి సభ్యులు నిరంజన్‌ బాబు రెడ్డి, డిసిఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతి రావు, కోవూరు సిఐ రామకష్ణారెడ్డి అందించారు. కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్ల అంకయ్య, ఉపాధ్యక్షులు రంగారావు, రాష్ట్ర కబడ్డీ రెఫరీస్‌ బోర్డు చైర్మన్‌ బాలస్వామి, కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి లవకుమార్‌, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి డి.విజయబాబు, జాన్సన్‌, విజయానందం,సింహాద్రి, తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు.