Jul 18,2021 08:04

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 91,594 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,672 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. 18 మంది మరణిం చారు. మరో 2,467 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 19,37,122కు, మరణాల సంఖ్య 13,115కు చేరిందని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటికే 18,98,966 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 25,041 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరిలో 504, చిత్తూరులో 372 కేసులు నమోద య్యాయి. అత్యల్పంగా కర్నూలులో 21, విజయనగరంలో 30 కేసులు నమోద య్యాయి. కరోనా లక్షణాలతో చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురేసి, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరేసి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.