నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు
కొత్తచెరువు : రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సబ్సిడీల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని పోతులకుంట గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికలలో వైసిపి తగిన మూల్యం చెల్లించుకక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఎస్ శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్ రామకృష్ణ, టౌన్ కన్వీనర్ వలిపి శ్రీనివాసులు మాజీ సర్పంచులు వెంకటరమణప్ప, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు










