Feb 08,2023 22:29

ప్రతిభా విద్యార్థులను అభినందిస్తున్న పాంచజన్య శ్రీనివాసులు, తదితరులు

ప్రజాశక్తి-హిందూపురం : భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆదాయపన్ను శాఖ అధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్‌ తదితర పోటీ పరీక్షల్లో పాంచజన్య పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనపర్చారు. పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపర్చారు. మంగళవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆదాయపన్ను శాఖ రాష్ట్ర కమిషనర్‌ బాలకృష్ణ, ప్రొఫెసర్‌ రాజరెడ్డి, కోటేశ్వరమ్మ చేతుల మీదుగా మెమోంటో, ప్రశంసాపత్రాలను అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభా కనబర్చిన విద్యార్థులను బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో పాంచజన్య శ్రీనివాసులు, పాఠశాల కరెస్పాంటెండ్‌, సెక్రటరీ నందకుమార్‌, హెచ్‌ఎం గాయిత్రి, ఎహెచ్‌ఎమ్‌లు విజయేంద్ర, శశికళ, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.