పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు ప్రజాశక్తి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు - సంపాదకులు
పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు ప్రజాశక్తి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు - సంపాదకులు
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మువన్నెల జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రతీనబూనాల్సిన రాజ్యాంగ పీఠిక ఇది.
రాజ్యాంగ పీఠిక భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తు (హోదా)లోను, అవకాశములోనూ సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాత్యైక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని 26 నవంబరు 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.










