- సచివాలయ నిబంధనల్లో మార్పులు
- ముసాయిదా సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రాల పరిధిలోని అత్యంత కీలకమైన శాంతిభద్రతల అంశాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిని ప్రతిఘటించి, తన హక్కులను కాపాడుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అడిగిందే తడువుగా నిబంధనలను సవరించడానికి సైతం సిద్ధమైంది. శాంతిభద్రతలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలంటూ అధికారులకు దిశానిర్ధేశాన్ని చేస్తూ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు సచివాలయ నిబంధనలను (గవర్నమెంట్ బిజినెస్‌రూల్స్)ను సవరిస్తూ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలను ఉనుతస్థాయి అధికారులకు పంపిణీ చేసింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. 'పాలనాపరమైన లేక రాజకీయంగా ముఖ్య అంశాలు' అంటూ రూపొందించిన అధ్యాయంలో ఈ అంశాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ కొన్ని అంశాలపై సాధ్యమైనంత త్వరగా సమాచారాన్ని పంపాలని కోరుతోందని పేర్కొన్నారు. నిజానికి ఇప్పుడు కూడా అవసరమైన సందర్భాలల్లో శాంతి భద్రతల పరంగా ఏర్పడిన సునిుత పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి నివేదిస్తున్నాయి. సాయానిు కూడా కోరుతునాుయి. ఇప్పుడు ఏకంగా బిజినెస్ రూల్స్‌లో చేర్చనుండటంతో ఆచరణలో ప్రతి అంశానిు కేంద్రానికి నివేదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, కేంద్ర జోక్యానికీ అవకాశమిచ్చినట్టు అవుతుందను అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది.
- సవరణలు ఇలా....
సమైక్య రాష్ట్ర విభజన తరువాత 2018 నవంబర్ నెలలో మొట్టమొదటి సారి గవర్నమెంట్ బిజినెస్ రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి నోటిఫై చేసింది. సమైక్య రాష్ట్రంలో ఉన్న 59 నిబంధనలను 22కు అప్పట్లో కుదించారు. దీనిలోనే శాఖల వారీగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిఅంశాలు, ఉమ్మడి జాబితా కిందకు వచ్చే వాటిని సోదాహరణంగా వివరించారు. 2018 బిజినెస్ రూల్స్‌లోని 20వ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి పేరుతో అధికార యంత్రాంగానికి తాజా సూచనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
- రాజకీయ కార్యక్రమాలు కూడా....?
తీవ్ర స్థాయిలో చోటుచేసుకునే రాజకీయ ఘర్షణలు ( పొలిటికల్ అవుట్‌రేజేస్)ను కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో జరిగే రాజకీయ పార్టీల కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెడుతోందను అభిప్రాయం వ్యక్తమవుతోంది. తీవ్ర స్థాయి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఆచరణలో దానిని నిర్వచించడం కష్టమని అంటున్నారు. తీవ్ర స్థాయిలో జరిగే ఘర్షణలు, ప్రజా జీవితానికి తీవ్ర స్థాయిలో ఆటంకం కలిగించే సంఘటనలు, కేంద్ర బలగాలను వినియోగించే పరిస్థితులు ఏర్పడినప్పుడు, ప్రకృతి విపత్తులు ఏర్పడి తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే తెలియచేయాలనితాజా ఉత్తర్వుల్లో పేర్కొనాురు. కేంద్ర ప్రభుత్వంతో పాటు, ముఖ్యమంత్రికి సంబంధిత శాఖ మంత్రికి కూడా ఈ వివరాలను వెంటనే తెలియచేయాలని సూచించారు. వీటిలో అనేక అంశాలపై కేంద్రానికి రాష్ట్రాలు ఇప్పటికే నివేదిస్తున్న విషయం తెలిసిందే.
- మంత్రుల ఫైళ్లను తిప్పిపంవవచ్చు
వివిధ అంశాలకు సంబంధించి మంత్రులు రూపొందించే ఫైళ్ళలో తప్పులుంటే వాటిని అధికారులు తిప్పిపంవవచ్చని తాజా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కేబినెట్ మంత్రులు తమ విధుల్లో భాగంగా పలు అరశాలపై స్టాండింగ్ ఆర్డర్లను లిఖిత పూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శులు తమ కింది అధికారులకు పంపించాలి. వీటిలో తప్పులు ఉన్నా, మార్పులు చేయాల్సి ఉన్నా, ఆ ఫైళ్లను కార్యదర్శులు మంత్రులకు తిప్పి పంపవచ్చని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
- తుది నిర్ణయం మంత్రులదే..
అదే సమయంలో విధాన నిర్ణయాలపై తుది నిర్ణయం మంత్రులదేనని ప్రతిపాదిత మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ అంశాలపై అధికారులకు, సంబంధిత శాఖ మంత్రికి మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకోవ్చని, అయితే, మంత్రి వ్యక్తం చేసిన అభిప్రాయమే తుది నిర్ణయమవుతుందని వీటిలో పేర్కొన్నారు. అదే విధంగా స్పీకర్‌కు, శాసన మండలి ఛైర్మన్‌కు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ అవుతుంది.
- సమాచారం మరింత రహస్యం
వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడంపై కూడా అనేక ఆంక్షలను తాజాగా ప్రతిపాదించారు. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేంతవరకు హెచ్‌ఓడిలకు కూడా తెలియచేయడానికి వీలు లేదని పేర్కొన్నారు. సచివాలయానికి సంబంధిరచిన ఫైళ్లను కూడా శాఖాధిపతులకు పంపించరాదన్నది ఇంకో ఆరక్షగా ప్రతిపాదించారు.










