Oct 22,2022 14:47

ప్రజాశక్తి-నందిగామ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివారం నందిగామ సిఐ కె సతీష్ ఆధ్వర్యంలో పట్టణంలో పుర వీధుల్లో పోలీస్‌ అమరవీరులను స్మరించుకుంటూ ర్యాలీ నిర్వహించారు. గాంధీ సెంటర్లో విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పండు దొర, ఎస్సై సురేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.