ప్రజాశక్తి కలక్టరేట్
పోలీసుల దాడిలో మంగళవారం అస్వస్థతకు గురై మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ ను బుధవారం విజయవాడ తరలించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈనేపద్యంలో పోలీసులు ఎస్ ఎఫ్ ఐ,నాయకులను ముందస్తుగా అరెస్టు చేసేందుకు వ్యవరించిన ఖటిన వైఖరి వల్ల పథకం ప్రకారం పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.పవన్ కుమార్ పై దాడి చేయడంతో స్పహ తప్పి అస్వస్థతకు గురి అయ్యాడు. సిపిఎం సిఐటియు ప్రజా సంఘాల ఆందోళన నేపథ్యంలో మంగళవారం నుండి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి కుదుట పడకపో వడంతో డాక్టర్ల సూచన మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పవన్ వెంట సిపిఎం నాయకులు కొడాలి శర్మ,ఐద్వా నాయకురాలు కె.సుజాత లు ఉన్నారు.
పవన్ కుమార్‌ను పరామర్శించిన
ప్రజా సంఘాల నాయకులు
విద్యా సంస్థల బంద్ నేపథ్యంలో పోలీసుల దాడిలో గాయపడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌కుమార్‌ను బుధవారం ఎల్‌ఐసి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్, మహిళా సంఘం పట్టణ కార్యదర్శి శ్రీలక్ష్మి, సిహెచ్ బుల్లెమ్మ, సిహెచ్ అరుణకుమారి, కే సుజాత,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కే శర్మ, సిహెచ్ రాజేష్, రజక వత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి కె నాగభూషణం, సిపిఐ నాయకులు మోదుమూడి రామారావు, ఏఐటీయూసీ నాయకులు లింగం పిలిప్, వై. ఈశ్వరరావు ఒడుగు రత్నకుమారి, సీపీఎం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, సిఐటియు నాయకులు, సి హెచ్ జయరావ్ ,ఎన్ పి ఆర్ డీ జిల్లా కార్యదర్శి ఎన్ ఎస్ నారాయణ, లు పరామర్శించిన వారిలో ఉన్నారు.










