Feb 11,2023 21:05

పుస్తకాలు పంపిణీ చేస్తున్న దృశ్యం

పుస్తకాలు పంపిణీ చేస్తున్న దృశ్యం
పుస్తకాలు పంపిణీ
వలేటివారిపాలెం :మండలంలోని పోలినేనిపాలెం ఎస్‌సి కాలనీలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆ కాలనీకి చెందిన పదో వార్డు స్వతంత్ర సభ్యులు ఎండ్లూరి ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం నోట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. అదేవిధంగా పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. ఆయన తరపున వీరాంజనేయులు ఈ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు చదువుతో మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు
. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా ప్రియదర్శిని అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఇంకా ఉపాధ్యాయుని పి పావని, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.