ప్రజాశక్తి-హిందూపురం : పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దామని మున్సిపల్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం పురపాలక సంఘంలోని ఎంజిఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఇన్‌చార్జి తహశీల్దార్, సిఐతో కలిసి పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చాంబర్‌లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి తహశీల్దార్ సౌజన్య మాట్లాడుతు ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలని అదేశాలు ఇచ్చిందన్నారు. అధికారులు ప్రతి ఒక్కరు ఎన్నికల కోడ్‌ను తప్పని సరిగా అమలు చేయాలన్నారు. దీంతో పాటు పోలీస్ అధికారులు శాంతిభద్రల పరిరక్షణకు సంబందించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ సిఐ ఈరన్న, రూరల్ సిఐ వేణుగోపాల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.










