Feb 08,2023 22:26

సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

బత్తలపల్లి : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో బుధవారం నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎపి కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌ బాబు, జెడ్పీటీసీ కోటి సుధ, సర్పంచు సక్కిం కాశమ్మ, ఎంపీటీసీ కోటి నరేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజాసమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య అంబులెన్సు ప్రారంభం : స్థానిక శివాలయం ముందు డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య అంబులెన్సును జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎంపీపీ గుర్రం వనజతో కలసి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ శుభదాసు, ధర్మవరం డివిజన్‌ డీడీ డాక్టర్‌ చంద్రశేఖర్‌, టీడీ శ్రీనివాస రావు, పశువైద్యాధికారి గురునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సచివాలయం ప్రారంభం : బత్తలపల్లి గ్రామ సచివాలయం-1ను జెడ్పీ చైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మతో కలిసి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ. 10 లక్షల అంచానా వ్యయంతో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించిన ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ యుగేశ్వరిదేవి, ఎంపీడీవో సాయిమనోహర్‌, సర్పంచు అక్కిం కాశమ్ము, ఎంపీటీసీ కోటి నరేష్‌, కార్యదర్శి ఉమాదేవి, నాయకులు కమతం ఈశ్వరయ్య, బండి వీరానారప్ప, గుర్రం శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్‌ బుగ్గిరి బయపరెడ్డి, ఉప సర్పంచి కోటి గోపినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : పురపాలక సంఘంలోని 16వ వార్డు రహమత్‌పురం ప్రాంతంలో బుధవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్‌ నాయకులు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డిఎన్‌ ఇంద్రజ, వైస్‌ఛైర్మన్‌ జబివుల్లా, వార్డు ఇన్‌చార్జ్‌ సలీం, పలువురు కౌన్సిలర్లు, వైసిపి నాయకులు మున్సిపల్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.