Mar 19,2023 21:35

జిల్లా పరిశ్రమల అధికారి జె. నాగరాజు

ప్రజాశక్తి - రాయచోటి
జిల్లాలో పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పారిశ్రామికవేత్తలు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జె. నాగరాజా పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో నిరుద్యోగ, యువత పరిశ్రమలు ఎలా స్థాపించాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.
జిల్లాలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి? ఎంత మందికి ఉపాధి కల్పించారు?
జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌ గిరీష సహకారంతో 3859 పరిశ్రమ లున్నాయి. సూక్ష్మ చిన్న ,మధ్య తరహా పరిశ్రమలున్నాయి. సుమారు రూ. 277.8 కోట్ల పెట్టుబడులతో 21, 859 మందికి ఉపాధి కల్పించాం. సింగల్‌ డేస్క్‌ పోర్టల్‌ ద్వారా అనుమతులు పొందాం. వివిధ దశలలో 142 పరిశ్రమలు ఉన్నాయి. సుమారు రూ. 133 కోట్ల పెట్టుబడి అంచనాతో 1585 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం.
జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలేంటి?
జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు మూడు, నాలుగు సార్లు పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులకు అవగాహన సదస్సులు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అనేక అనుమతులు మంజూరు చేసింది. సింగల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా ఇప్పటి వరకు 1464 అనుమతుల కోసం దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 14 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశాం.
ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు ?
జిల్లాలో లభ్యమైన ముడిసరుకులైన మినరల్స్‌ , కెమికల్స్‌ ఉత్పత్తులు, పివిఎస్‌ పైపులు, ప్లాస్టిక్‌ క్రెట్స్‌, నర్సరీ ప్రోటర్సీ, ప్లాస్టిక్‌ పెట్‌ బాటల్గు , యూపీ విసి విండోస్‌, డోర్లు , గ్రానైట్స్‌ , బొరుగులు తయారీ సెమికుక్‌ ఫుడ్స్‌ ఫుడ్స్‌ బయో పంటలైజర్లు , ట్యూటీ పండ్లు మొదలగు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు.
రాయితీలో వివరాలు తెలపండి ?
ఇప్పటివరకు అనుమతులు ఉన్న ఇండిస్టియల్‌ ఢెవలప్మెంట్‌ పాలసీ 2020 - 23 వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాస పథకం కింద 276 యూనిట్లు, రూ.14.12 కోట్ల పెట్టుబడితో వడ్డీ, సేల్స్‌ టాక్స్‌ రాయతీలు మంజూరయ్యాయి. పిఎం ఇజిఎఫ్‌ పథకం కింద జిల్లా లో పరిశ్రమల ఏర్పాటుకు రూ. 359 లక్షలు కేటాయించగా ఇప్పటివరకు రూ. 49.57 లక్షల రుణాలు మంజూరయ్యాయి. జిల్లాలో అన్ని బ్యాంకుల ద్వారా ఈ పథకం అమలు చేస్తున్నాం. పథకం కింద ఉత్పత్తి రంగానికి గరిష్టంగా రూ. 50 లక్షలు, సేవా రంగానికి గరిష్టంగా రూ. 20 లక్షలు వరకు రుణాలు అందజేస్తున్నాం. ఉత్పత్తి రంగానికి 18 ఏళ్లు, 8వ తరగతి పాస్‌ అయిన వారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి గరిష్టంగా 35 శాతం, పట్టణ ప్రాంతం వారికి 25 శాతం శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తాం. ఆన్‌లైన్‌లో 365 రోజులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి శిక్షణలిస్తున్నారు?
పరిశ్రమలు ఏర్పాటు చేయదలచుకునే అభ్యర్థులు వాటి పట్ల కొంత అవగాహన కల్గి ఉండాలి. పరిస్థితులు అనుగుణంగా ఏ పరిశ్రమలు పెడితే అభివద్ధి సాధిస్తారో కొంత వరకు అవగాహన అవసరం. ఏర్పాటు చేసిన పరిశ్రమల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శిక్షణ ఇప్పిస్తాం.