Sep 16,2023 19:22

విద్యార్థులను అభినందిస్తున్న కంచర్ల రామయ్య

ప్రజాశక్తి-కందుకూరు : కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సైబర్‌ సెక్యూరిటీ(సిఎస్‌) విద్యార్థులు ప్రత్యేకతను చాటేందుకు కషి చేయాలని కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య ఉద్భవించారు. ఇంజనీర్స్‌ డే సందర్భంగా సి.ఎస్‌ విద్యార్థులు శనివారం కరస్పాండెంట్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ (సిఎస్‌)ప్రస్తుతం సమాజంలో కీలక ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక హితంతో కూడిన సిఎస్‌ను ప్రజోపయోగాలకు వినియోగించేందుకు సిఎస్‌ బ్రాంచ్‌ విద్యార్థులు దష్టి కేంద్రీకరించాలన్నారు. హెచ్‌.ఓ.డి రాయుడు మాట్లాడుతూ ప్రత్యేక సాప్ట్‌ వేర్‌ అవసరమని, త్వరలో ఇన్స్టాల్‌ చేసి విద్యార్థులను దానిపై పనిచేసేలా మార్పులు చేస్తామని పేర్కొన్నారు. పరిశోధనకు పూనుకోవాలి సి.ఎస్‌ బ్రాంచి విద్యార్థులకు అవసరమైన మౌలిక వనరులపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని డైరెక్టర్‌ డాక్టర్‌ కంచర్ల విజయ శ్రీనివాస్‌ సూచించారు. సిఎస్‌ఇ అన్ని విభాగాల అకడమిక్‌ టాపర్స్‌ గా నిలిచిన అపర్ణ, వినీల,భూమిక, సూర్య మణి, అమూల్య, కవిత, చందు, సంపత్‌, శ్రీనివాసాచారి, వెంకట్‌ లు హెచ్‌ ఓ డి రాయుడు పాల్గొన్నారు.