ప్రజాశక్తి-నెల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, పోలీసుల అణచివేత చర్యలకు నిరసిస్తూ సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరైయ్యారు. ఆదివారం నిర్వహించిన ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నియంత పాలన సాగుతుందన్నారు. ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు , ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వ్యవస్థనే లేకుండా చేయాలని ఉద్దేశంతో పోలీసులు ద్వారా ఉద్యమాలను ప్రభుత్వం అణిచివేయాలని చూడటం సరికాదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.మోహన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు గానీ, వామపక్షాలు ప్రజా సంఘాలు ప్రజాతంత్ర వాదులు ఎవరైనా ప్రజా సమస్యలపై పోరాటానికి పిలుపునిస్తే ఎక్కడికి అక్కడ హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, కేసులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయడం రాజ్యాంగం కల్పించిన నైతిక హక్కు నైతిక విలువలను కాలరాస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాజయ్య, సిపిఐ సీనియర్ నాయకులు రామరాజు, ఐఎన్‌ఎల్ రాష్ట్ర అధ్యక్షులు సమీ హుసేని, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, జనసేన నాయకులు గునుకుల కిషోర్, జనసేన నాయకులు షబ్బీర్, ఎస్ డి పి ఐ నగర అధ్యక్షులు ఆబిద్, ముస్లిం ఫెడరేషన్ నాయకులు జియా, నందయ్య, షానవాజ్, మస్తాన్, మున్నా, ఆది, రమణయ్య, రామకష్ణ పాల్గొన్నారు.










