Jul 19,2021 08:26

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. సోమవారం కె.రామకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీతో నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరుతూ ఈరోజు చలో అమరావతికి పిలుపునిచ్చిన నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాల శాంతియుత ఉద్యమాలపై పోలీసుల ఉక్కుపాదం తగదని అన్నారు. అరకొర ఉద్యోగాల భర్తీతో జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయటం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమేనన్నారు. గత రెండేళ్లుగా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయకుండా సిఎం జగన్మోహన్‌ రెడ్డి మాట తప్పటం నిజమా కాదా ? అని రామకృష్ణ ప్రశ్నించారు.