ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు రెండో పొగాకు వేలం కేంద్రం పరిధిలోని నందనవనం, పలుకూరు, నరిశెట్టి వారి పాలెం, కోవూరు గ్రామాలను రైతు మిత్ర బందం సభ్యులు పొగాకు బోర్డు, ట్రేడ్ మిత్రులు సోమవారం పొంగతోటను సందర్శించారు. ఈ సందర్భంగా వారు తోటలలో అంతర సేద్యం చేయాలని, దీనివల్ల పంట ఏపుగా పెరుగుతుందని రైతులకు సూచించారు. పొగ తోటలలో లింగకార బట్టలు, జిగురు అట్టలు ఏర్పాటు చేయాలని తెలిపారు. తోటలలో అంచులలో బంతి మొక్కలు, జొన్న, ఆముదం వేయాలని సూచించారు. చీడపీడల నివారణకు సూచనలు చేశారు. నాణ్యమైన పొగాకు పండించాలని తెలిపారు. అక్షన్ సూపరింటెండెంట్ సిద్దరాజు, సిటిఆర్‌ఐ హెడ్ అనురాధ, ఐటీసీ మేనేజర్ వెంకట రావు, జిపిఐ మేనేజర్ ఉన్నం శ్రీనివాసరావు, ఎఓఐ మేనేజర్ ప్రసాద్, ఫీల్డ్ ఆఫీసర్ వెంకట్రావు పాల్గొన్నారు.










