పంట నమోదు చేసుకోవాలి
ప్రజాశక్తి-అల్లూరు : వ్యవసాయ రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని తహశీల్దార్ శ్రీరామకృష్ణ, వ్యవసాయ అధికారి వేణుగోపాలరావు వెల్లడించారు. మంగళవారం మండల కేంద్రం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో విఆర్‌ఒలు, విఎఒలతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలంటే ఆయా రైతు భరోసా కేంద్రాలలో ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవాలన్నారు. పోక్రిమెంట్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవచ్చని తెలియజేశారు. అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించిన పలు సబ్సిడీలు పొందవచ్చునని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ చెంచయ్య, సీనియర్ అసిస్టెంట్ సుధీర్, సర్వేయర్ అన్రూప్, పలువురు విఆర్‌ఒలు, విఎఒలు పాల్గొన్నారు.










