ప్రజాశక్తి-విజయవాడ
ఎరుకల మహిళ పంచాయతీ కార్యదర్శి రొడ్డ భవానీ మతికి కారణమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల ఎంపిపి భర్త దంగేటి రాంబాబును తక్షణం అరెస్ట్ చెయాలని సింగ్‌నగర్ 59వ డివిజన్ ఎస్టీ కాలనీలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాలాద్రి, జిల్లా కార్యదర్శి జి.నటరాజ్ మాట్లాడుతూ భవానీ కుటుంబ సభ్యులను పిలిపించి రాజీ ప్రయత్నాలు చేస్తున్న పోలీసుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దొడ్డ భవాని మరణానికి కారకుడైన వైసిపి ఎంపీపీ భర్త రాంబాబును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా పెట్టామని చెప్పిన తెల్లవారే సరికే ఎస్టీ, ఎస్సీ దళిత కుటుంబాలపై దాడులు జరగడం అత్యంత సోచనీయమన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుతలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఆరుగురు మంత్రులు ఉన్నప్పటికీ, జరుగుతున్న ఘటనలను వ్యతిరేకిస్తూ ఎస్సీ ఎస్టీలకు భరోసా కల్పించే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ఎప్పటికైనా దళితుల పక్షాన నిలబడి వారికి సహకారం అందించి దళిత అభివద్ధి కోసం కషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిటీ అధ్యక్షులు చింతల శ్రీనివాస్.59డివిజన్ కార్యదర్శి కె. కష్ణమురళి పాల్గొన్నారు.










