పిడిఎఫ్ ఎంఎల్‌సి గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి అనంతసాగరం : త్వరలో జరుగబోవు ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని యుటిఎఫ్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని పట్టభద్రులను కలిసి ఓట్లను అడిగారు. ఎంఎల్‌సి ఎన్నికల కన్వీనర్ ఎస్‌డి వల్లిఅహ్మద్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం శాసనమండలిలో ప్రభుత్వాలను నిలదీసి అడుగుతున్న ఎంఎల్‌సిలు మాత్రమేనని మేధావుల సభకు మేధావులను పంపించాలని, కనుక పట్టభద్రుల అభ్యర్థి మీగడ వేంకటేశ్వర్లు రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెవివి నాయకులు వేము పెంచలయ్య, గాడి సుధాకర్, సిఐటియు అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా, యుటిఎఫ్ మండల కార్యదర్శి సాదిక్, రహంతుల్లా, ఎస్‌కె.అబ్దుల్‌కరీం తదితరులు పాల్గొన్నారు.










